Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణవంశీ కోసం రంగంలోకి దిగిన రమ్యకృష్ణ?

  • 'నిన్నే పెళ్లాడుతా' సూపర్ హిట్
  • కొంతకాలంగా హిట్స్ లేని కృష్ణవంశీ
  • నాగ్ బ్యానర్ పై చేసే అవకాశం?        
క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీకి చాలాకాలంగా సక్సెస్ లు లేవు. కొంతకాలంగా ఆయనకి అవకాశాలు కూడా లేవు. మరాఠీ సినిమా 'నట సామ్రాట్'ను తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు కూడా అంత వేగంగా ముందుకు వెళ్లడం లేదట. ఈ నేపథ్యంలో నాగార్జున సొంత బ్యానర్లో ఓ సినిమా చేయాలనే ఉత్సాహంతో కృష్ణవంశీ ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

గతంలో నాగార్జునతో కృష్ణవంశీ తెరకెక్కించిన 'నిన్నే పెళ్లాడుతా' సినిమా, నాగ్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఆ తరువాత 'చంద్రలేఖ' సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. వీలైతే నాగ్ తో .. లేదంటే చైతూతో గానీ .. అఖిల్ తో గాని సినిమా చేయడానికి కృష్ణవంశీ ఆసక్తిని కనబరుస్తున్నాడట. ఈ విషయంలో నాగ్ ను ఒప్పించేందుకు రమ్యకృష్ణ తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. నాగ్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందో లేదో చూడాలి మరి. 
ramyakrishna

More Telugu News